పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ 50 శాతం షూటింగ్ పూర్తి

పవన్ కళ్యాణ్ 'ఓజీ' 50 శాతం షూటింగ్ పూర్తి

ఆస్కార్ విజేత అయిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. దేశంలోని ప్రముఖ నటీనటులతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ పూర్తి కావడంతో, ఈ చిత్రం 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. “యాక్షన్, ఎపిక్‌నెస్ మరియు డ్రామా… మూడు అద్భుతమైన షెడ్యూల్‌లు పూర్తయ్యాయి, దుమ్ము రేపాయి. ఓజీ చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. రాబోయే షెడ్యూల్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి” అంటూ ఈ విషయాన్ని…