పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రెండవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలిసి ‘గబ్బర్ సింగ్’ కంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అందించడానికి పని చేస్తున్నారు. డెడ్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం నెక్స్ట్ షెడ్యూల్ కోసం భారీ సెట్‌ను నిర్మించారు. అక్కడ పవన్ కళ్యాణ్, ఇతర తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రెండవ షెడ్యూల్ ప్రారంభానికి ముందు మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తున్నారు. ఖాకీ యూనిఫాంలో డాషింగ్ గా కనిపిస్తుండగా, ఇతర…

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ పూర్తి

Ustaad Bhagat Singh to present Pawan Kalyan in a never-seen-before action avatar, a massive sequence with over 1000 junior artistes canned

తొలి షెడ్యూల్ లో యాక్షన్ మరియు ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాల చిత్రీకరణ పవన్ కళ్యాణ్ తన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారంలో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్…

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలైంది..

Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh, produced by Mythri Movie Makers, goes on floors

-‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ -పోలీస్ స్టేషన్ సెట్ లో బుధవారం ప్రారంభమైన షూటింగ్ -మొదటి షెడ్యుల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గత డిసెంబర్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.…