నేచురల్ స్టార్ నాని ‘దసరా’ షూటింగ్ పూర్తి

నేచురల్ స్టార్ నాని 'దసరా' షూటింగ్ పూర్తి

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలో తన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా…