ఓ యువకుడు డిటెక్టివ్ కావాలనుకుంటాడు. అదే సమయంలో ప్రేమలో పడతాడు. నచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉంటాడు. అయితే అనుకోకుండా అతని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. రాత్రి సమయంలో మారేడు కోన అనే ప్రాంతానికి రాకపోకలు నిషేధం. అలాంటి ఊరికి హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది!. అసలు మారేడు కోనకు, మా కథకు ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘అన్వేషి’ సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత టి.గణపతి రెడ్డి. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను సోమవారం ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. టీజర్‌ను గమనిస్తే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్లు…
