నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’ నుంచి విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న “జూమ్ జూమ్” పాట

Musical melody 'Jhoom Jhoom Re..' from Nikhil Siddharth's 'Spy' dropped

యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ 2” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఇప్పుడు వరుస సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. అలాగే వరుస లైనప్ సినిమాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ తరుణంలో గ్యారీ పిహెచ్ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా స్పై. ఈడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్టోరీ, డెత్ మిస్టరీ ఆధారంగా ఉత్తరకెక్కుతున్న సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. జూమ్ జూమ్ అంటూ సాగే ఈ పాట నికుల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ మధ్య వచ్చే లవ్ రొమాంటిక్ సాంగ్. అనురాగ్ కులకర్ణి, రమ్య బేహారా పాడిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ రచయితగా వ్యవహరించారు. సీతారమమ్…