మెగా పవర్‌స్టార్ యు.ఎస్‌లో సందడి చేస్తున్నారు. ఇటీవలే ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వహించిన ఇంటర్వ్యూస్‌లో పాల్గొన్న రామ్ చరణ్ ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు. యు.ఎస్‌లో ఇప్పుడందరూ చరణ్‌ను గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్లోని పాపులర్ ఎంటర్‌టైన్మెంట్ చానెల్ KTLA రామ్ చరణ్‌ను ఇంటర్వ్యూ చేసింది. లాస్ ఏంజిల్స్‌లో మార్చి 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరనుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌పై ప్రధానంగా దృష్టి పెట్టారు. KTLAకి చెందిన శామ్ రూబిన్ వెర్సటైల్ యాక్షన్ హీరో రామ్ చరణ్‌తో మాట్లాడుతూ ఆస్కార్ నామినేషన్స్ గురించి, ప్రస్తుతం అతని ఆలోచనా విధానంపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR…
