అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ వేసవిలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టీజర్ టీజ్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్ టీజర్‌తో వచ్చారు. నాగ చైతన్య వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు , ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్…
Tag: నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ గ్లింప్స్ విడుదల
నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ చివరి షెడ్యూల్ ప్రారంభం
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. టీమ్ ఈరోజు చివరి షెడ్యూల్ షూట్‌ని ప్రారంభించింది. దీనితో మొత్తం ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. ప్రధాన నటీనటులందరూ పాల్గొంటున్న ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్ లో కనిపించిన కస్టడీ గ్లింప్స్ న్యూ ఇయర్ కానుకగా విడుదలైంది. ఈ టీజర్ లో టెక్నికల్ బ్రిలియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీజర్‌లో నాగ చైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్,…
నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ గ్లింప్స్ విడుదల
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. ‘కస్టడీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 12, 2023న విడుదలవుతోంది. గ్రాండ్ గా న్యూ ఇయర్ 2023కి స్వాగతం పలుకుతూ.. ఈరోజు మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి గ్లింప్స్…
