నరేష్ – పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ నుంచి ఉరిమే కాలమా పాట విడుదల

నరేష్ - పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ నుంచి ఉరిమే కాలమా పాట విడుదల

నవరస రాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలిసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విలక్షణమైన కథతో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా మేకర్ ఎమ్‌ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ఈ చిత్రంలోని ఉరిమే కాలమా పాటని విడుదల చేశారు. కథలో కీలకమైన ఈ పాటని సురేష్ బొబ్బిలి హాంటింగ్ ట్యూన్ గా కంపోజ్ చేశారు. నిజమైన ప్రేమ- విధి థీమ్ గా సాగిన ఈ పాటకు అనంత శ్రీ అద్భుతమైన సాహిత్యం…