నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ కు జోడిగా పవిత్రా లోకేష్ నటిస్తున్నారు. మెగా మేకర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి రచన , దర్శకత్వం వహిస్తుండగా, నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంతో లెజెండరీ ప్రొడక్షన్ బ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌ను నరేష్ పున:ప్రారంభించారు. ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో ఓ అందమైన ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గు వేస్తుండగా సాంప్రదాయ దుస్తులలో నరేష్ ఆ ముగ్గు వేయడాన్ని ఆనందంగా చూస్తూ కనిపించారు. ఫస్ట్‌లుక్…
