గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలసి #NBK108 తో మాసెస్, అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్, అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి అందరికి మాస్ ఫీస్ట్ అందించారు మేకర్స్. బాలకృష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్న రెండు పోస్టర్లను విడుదల చేశారు. మొదటి పోస్టర్ లో సాంప్రదాయ దుస్తులు ధరించి, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు బాలకృష్ణ. మెడ, చేతిపై పవిత్రమైన దారాలను ధరించడం ఆసక్తికరంగా…
