నందమూరి తారకరత్న కన్నుమూత

నందమూరి తారకరత్న కన్నుమూత

గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. నారాయణ హృదయాలయకు విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చి బెంగళూరులో తారకరత్నకు చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోమాలోకి వెళ్లిన తారకరత్నను కాపాడేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పంలో హార్ట్ స్ట్రోక్‌ కు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయకు షిఫ్ట్ చేశారు. అప్పటినుంచి చికిత్స కొనసాగింది. తారకరత్న మరణ వార్తతో సినీ లోకంతో విషాదం అలుముకుంది. తారకరత్న మరణ వార్త తెలిసి నందమూరి ఫ్యామిలీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. నందమూరి…