‘మహా పురుషుడు NTR తెలుగువారి ఆరాధ్య దైవం తాత లాంటి వారితో నన్ను పోల్చవద్దు. ఆయన స్థాయిని నేను చేరు కోలేను’ అని ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొ న్నారు. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజు చెన్నై మ్యూజిక్ అకాడమీ లొ వైభవంగా జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య తదితరులు పాల్గొని ఉగాది సత్కరము స్వీకరించిన అనంతరం అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ముందుగా బాపూబొమ్మ పురస్కారాన్ని…
