క్రసెంట్ సినిమాస్, కృష్ణ ప్రొడక్షన్స్ సంయుక్తంగా… కొత్త దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. పవర్ ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు దశథ్ ఆవిష్కరించి.. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదర్భంగా దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ..‘తమిళ నాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమ్మాయిలను ట్రాప్ చేసి… వాళ్ల నగ్న వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యక్తిని బాధిత అమ్మాయిలు ఎలా పట్టుకున్నారు అనేదే ఈ చిత్రం కథ. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కరెంట్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు. సిరాజ్ తో చాలా కాలం నుంచి పరిచయం వుంది. టైటిల్…