పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగబ్బాయి కావడంతో ఆది పినిశెట్టికి ఇక్కడ కూడా కాస్త మంచి క్రేజే ఉంది. పైగా చిరు, వెంకీ, బాలయ్య, మోహన్ బాబులకు మరిచిపోలేని హిట్లిచ్చిన రవిరాజా పినిశెట్టి కొడుకు అవడంతో ఇక్కడి ప్రేక్షకులు ఆది సినిమాలను బాగానే ఆదరిస్తారు. దానికి తోడు నటనలో ఆయన ఎంత మేటో నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలం వంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. అంతేకాకుండా ఆది ఇండస్ట్రీటోకి ఎంట్రీ ఇచ్చింది కూడా తెలుగు సినిమాతోనే. ఇలా తెలుగు వాళ్లతో ఆదికి ఎనలేని అనుబంధం ఉంది. ఇక ఆది తన నటించిన ప్రతీ సినిమాను తెలుగులోనూ డబ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన పార్ట్‌నర్ సినిమాను కూడా తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్…
