‘తిరగబడరసామీ’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

'తిరగబడరసామీ' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హీరోయిన్, రాజ్ తరుణ్ ని ఎత్తుకున్నట్లు వున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. పోస్టర్ లో రాజ్ తరుణ్ బనియన్, బాక్సర్స్ ధరించి కళ్ళజోడుతో కనిపించారు. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో ప్లజంట్ మ్యూజిక్ తో మోషన్ పోస్టర్ రివిల్ కావడం ఇంట్రస్టింగా వుంది. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే…