డి.సురేష్‌ బాబు చేతుల మీదుగా రుహాణి శర్మ ‘HER’ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల

డి.సురేష్‌ బాబు చేతుల మీదుగా రుహాణి శర్మ 'HER' రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల

చి.ల.సౌ మూవీతో రుహాణి శర్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ సినిమాతో క్లాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. మాస్‌ ఆడియెన్స్‌ను మెప్పించే చిత్రాలను సైతం చేశారు. ఇప్పుడు రుహాణి శర్మ కొత్త జానర్‌ను ఎంచుకున్నారు. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న…