డిసెంబర్ లో ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ విడుదల

డిసెంబర్ లో 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ విడుదల

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్‌ పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మృదుల నటించారు. అన్యుక్తరామ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జి.వి భాస్కర్‌ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘ఘంటసాల పాటశాల’ సంకలన కర్త సి.హెచ్‌. రామారావు దర్శకత్వం వహించారు. షూటింగ్‌ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ఫిల్మ్‌ చాంబర్‌లో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఘంటసాల అనగానే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. మన నరనరాన ఆయన పేరు ఉండిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి కథతో, ఘంటసాలగారి మీద…