మిథున్ చక్రవర్తి కుమారుడు హీరోగా ‘నేనెక్కడున్నా’ టైటిల్, టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు

మిథున్ చక్రవర్తి కుమారుడు హీరోగా 'నేనెక్కడున్నా' టైటిల్, టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు

సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు  మిమో చక్రవర్తిని తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాధవ్ కోదాడ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘నేనెక్కడున్నా’. దర్శకుడిగా ఆయనకు కూడా తొలి చిత్రమిది. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. ‘నేనెక్కడున్నా’ టైటిల్, టీజర్ విడుదల అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ ”టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.  చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ”జర్నలిజం, రాజకీయం…