జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్.. అద్భుతంగా ‘ఆదిపురుష్’ మొదటి పాట!

జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్.. అద్భుతంగా 'ఆదిపురుష్' మొదటి పాట

ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్‌. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది. గతంలో విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే గీతాన్ని విడుదల చేశారు. డివోషనల్ సాంగ్స్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న అజయ్ – అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి రాశాడు. ”జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.. సహచరులై సహా వస్తున్నాం.. సకలం స్వామి కార్యం.. మహిమాన్విత మంత్రం నీ నామం”..…