ఇటీవలే హాలీవుడ్ లో కార్మికులు సమ్మెకు దిగారు. తమ వేతనాలు పెంచాలని రోడ్డుకు ఎక్కారు. షూటింగ్ లు ఆగిపోయాయి. కానీ సినిమా విడుదలకు ఎటువంటి ప్రభావం లేదు అని యూనివర్సల్ పిక్చర్స్ తెలియజేస్తుంది. తాజా జులై 21న ఓపెన్‌హైమర్ చిత్రం విడుదల కాబోతుంది. ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ చిత్రం. ఇది క్రిస్టోఫర్ నోలన్ రచన, నిర్మాణం, దర్శకత్వంలో రూపొందింది. యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్‌లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది. ఇది 2005లో కై బర్డ్, మార్టిన్ J. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ గురించి. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్‌గా నటించారు, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ…