మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా జీ 5 దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 భాషల్లో అన్‌లిమిటెడ్ కంటెంట్‌ను అందిస్తోంది. ఇప్పటికే క్రేజీ సినిమాలు, ఒరిజినల్స్, టాక్ షోస్ అంటూ డిఫరెంట్ కంటెంట్‌ను అందిస్తూ తనదైన స్థానాన్ని దక్కించుకున్న జీ 5 దూసుకెళ్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం , అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి లాసర్ 2, బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘గాలి వాన’, ‘రేసీ’, హల్ వరల్డ్ మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట, రీసెంట్‌గా ఏటీఎం వంటి ఒరిజినల్స్‌ను ప్రేక్షకులకు అందించింది జీ 5. తాజాగా ఇప్పుడు జీ 5 లైబ్రరీలో…
