ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, మాస్ మొగుడు.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’.. ఈ…
