తెలుగు సినీ కార్మిక దినోత్సవ కార్యక్రమం హైదరాబాద్ల లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, దర్శకులు కాశీ విశ్వనాథ్, ఎన్ శంకర్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లిరామసత్య నారాయణ తదితరులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా సినీ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన ఇరవై నాలుగు విభాగాల వారికి సన్మానం చేశారు. పాటల రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిస్, స్టంట్ మాస్టర్ కింగ్ సొలమన్ లకు సన్మానం జరిపారు. ఫిలిం ఫెడరేషన్ కు ఇటీవల ఎన్నికైన అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ…
