ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రజనీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని, ఇచ్చే వరకు తెలుగు ప్రజలు అడుగుతూనే ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘‘భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఒక వ్యక్తి కాదు.. శక్తి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది. పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించాలి. ఎన్టీఆర్ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. దేశ రాజకీయాల్లో మార్పు…
