అన్విక ఆర్ట్స్ వారి “ఎర్రగుడి” సినిమా మూడో షెడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఆ వివరాలను దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి తెలియజేశారు. ” ఫిబ్రవరి 27 నుంచి మార్చి 10వ తేదీ వరకు జరిగిన మూడో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కార్యక్రమాలు 70శాతం పూర్తయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ మండువా హౌస్, బూత్ బంగ్లా, కేరళ హౌస్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాము. ఆదిత్య ఓం, వెంకట్ కిరణ్, శ్రీజిత ఘోష్, సమ్మెట గాంధీ, ఎస్తేర్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జ్యోతి, శ్రావణి, గూడ రామకృష్ణ, మధు నంబియార్, ఆర్కే, గంగాధర్, రవిరెడ్డి, దేవి శ్రీ ప్రభు తదితరులపై కథలోని కీలక ఘట్టాలను చిత్రీకరించాము. మార్చి 10 వరకు జరిగిన షెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ లో జరిగే నాలుగో…
