2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని ఫిలిం నగర్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎఫ్.ఎన్.సి.సి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందం గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విచ్చేశారు. తొలుత ఎఫ్.ఎన్.సి.సి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మరియు కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం నటరాజ్ మాస్టర్ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు, వివిధ తెలుగు పండుగలను తెలియజేస్తూ చేసిన ప్రత్యేక నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వినోద్‌బాబు ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. అలాగే…
