ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులని అలరించనుంది. వారి కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం వీరిద్దరూ మళ్లీ కలిశారు. ఈసారి డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో. ఈరోజు కోర్ టీమ్, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఛార్మి క్లాప్ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్!…
Tag: ఉస్తాద్ రామ్ పోతినేని
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ #బోయపాటి రాపో షూట్ లో జాయిన్ అయిన శ్రీలీల
మాసీవ్ బ్లాక్బస్టర్ ‘అఖండ’ చిత్రాన్ని అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ #బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరో రామ్ కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో…
