హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా రూపొందించిన చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలను కూడా అందుకుందీ చిత్రం. వర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌తో బలగం సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బలగం సినిమా తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా అనేక అవార్డులను సొంతం చేసుకుంటోంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు అవార్డులను అంతర్జాతీయంగా దక్కించుకుంటోంది బలగం సినిమా. తాజాగా ఈ లిస్టులో మరో రెండు అంతర్జాతీయ అవార్డులు…