ఉత్కంఠను రేపుతోన్న ‘సైంధవ్’ అనౌన్స్ మెంట్స్!

ఉత్కంఠను రేపుతోన్న 'సైంధవ్' అనౌన్స్ మెంట్స్!

తాజాగా డాక్టర్ రేణుగా రుహానీశర్మ పరిచయం విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడరు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో డాక్టర్ రేణు పాత్రను రుహాని శర్మ పోషిస్తోంది. దర్శకుడి మొదటి చిత్రం ‘HIT’లో కనిపించిన రుహాని ‘సైంధవ్‌’లో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో రుహానీ శర్మ ఎథ్నిక్ వేర్‌లో సీరియస్ గా కనిపిస్తోంది.…