ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలకు, చిత్ర టీజర్, ట్రైలర్స్ లకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎస్.కె.ఎం. ఎల్. మోషన్ పిక్చర్స్ సంస్థ ద్వారా జూన్ 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యి ఈ నెల 21 న విడుదల అవుతున్న అలా ఇలా ఎలా…
