టాలీవుడ్ లో ఈ కొత్త ఏడాది 2013లో ముఖ్యంగా ఇద్దరు బ్యూటీస్ మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది. 2012 ఆరంభంలో ‘బంగార్రాజు’తో హిట్ కొట్టింది హీరోయిన్ కృతి శెట్టి. ఈ ఏడాది చివరిలో ‘ధమాకా’తో హిట్ అందుకుంది అందాలభామ శ్రీలీల. గ్లామర్ పరంగా.. యాక్టింగ్ .. డాన్సులలోనూ ఇద్దరూ ఇద్దరే! తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నటనలో రాణిస్తూ దుమ్ము దులిపేస్తున్నారు. ఈ ఏడాది 2013లో ఇద్దరు బ్యూటీస్ చేతుల్లోనూ భారీ ప్రాజెక్టులు ఉండడంతో టాలీవుడ్ దృష్టి వీరిపై పడింది. తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతూనే కృతిశెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. తన తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలకాకముందే రెండు చిత్రాలు అంగీకరించింది. ఆ రెండు సినిమాలతో కలుపుకుని హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. టాలీవుడ్ లో అడుగు పెడుతూనే ఈ మధ్య కాలంలో ఒక…
