ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన కేటగిరీ సినిమా ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ : నటకిరీటి రాజేంద్రప్రసాద్‌

ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన కేటగిరీ సినిమా ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ : నటకిరీటి రాజేంద్రప్రసాద్‌

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. మార్చిలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి పలు విశేషాలను యూనిట్‌ మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ… గత…