ఆ ఒక్క మాట ఎంతో శక్తినిచ్చింది : ‘కొరమీను’ దర్శకుడు శ్రీపతి కర్రి

ఆ ఒక్క మాట ఎంతో శక్తినిచ్చింది : 'కొరమీను' దర్శకుడు శ్రీపతి కర్రి

‘కొరమీను’ చిత్రం విడుదలైన మరుసటి రోజు మా నాన్న ఫోన్ చేసి “ఈ రోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ తీరిపోయాయిరా” అనడం “కొరమీను” సినిమాకి సంబంధించి మాత్రమే కాదు… నా జీవిదానికి సంబంధించి నేను అందుకున్న అతి పెద్ద కాంప్లిమెంట్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్” అంటున్నాడు యువ దర్శకుడు శ్రీపతి కర్రి. తన తొలి చిత్రంతోనే ఓ మోస్తరు “హల్ చల్” చేసిన ఈ వైజాగ్ కుర్రాడు తీసిన రెండో సినిమా “కొరమీను”కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఆనంద్ రవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సమన్యరెడ్డి నిర్మించారు. 2022కి ఘనమైన వీడ్కోలు పలికిన చిత్రంగా ప్రశంసలందుకుంటున్న “కొరమీను” చిత్రం ఇంత బాగా రావడంలో ఈ చిత్ర రచయిత, హీరో అయిన ఆనంద్ రవి, నిర్మాత సమన్య రెడ్డిలకే…