ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది: కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి

ఆస్కార్‌ దగ్గరలోనే ఉందనిపిస్తోంది: కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగిందని తెలిసి చాలా సంతోషించానని కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి అన్నారు. అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే పలు అవార్డులతో సత్తా చాటిన రాజమౌళి మార్క్ చిత్రం ఆర్ఆర్ఆర్ తాజాగా హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల్లో ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టి భారత సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’, ‘ఉత్తమ యాక్షన్ చిత్రం’, ‘ఉత్తమ స్టంట్స్’, ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో అవార్డులు గెలిచి తెలుగు సినిమా సత్తా చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ విజయంతో ఆస్కార్‌ కూడా మనకు దగ్గరలోనే ఉందని నాకనిపోస్తోంది. ఈ ఘనత సాధించిన రాజమౌళి…