విశ్వవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆస్కార్ 2023 వేడుకల్లో రామ్‌చరణ్, ఉపాసన దంపతుల వస్త్రధారణ మెప్పిస్తోంది. డిజైనర్, కస్టమ్ మేడ్ ఎటైర్‌లో చూపరుల దృష్టిని ఆకర్షించారు ఈ జంట. అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల పనితనాన్ని ప్రదర్శించేలా ఉన్నాయి వారి వస్త్రాలు. ఈవెంట్ ఏదైనా ఫ్యాషన్ ప్రియులను అలరించే అంశాలు కొన్ని ఉంటాయి. 2023 ఆస్కార్ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యాషన్ ప్రియులను మెప్పించే అత్యద్భుతమైన, గుర్తుంచుకోదగ్గ వస్త్రాల్లో కనిపించారు. ఆయన వస్త్రాలను ఫ్యాషన్ డిజైనర్స్ శాంతను, నిఖిల్ రూపొందించారు. ఆర్ ఆర్ ఆర్‌లో ఆయన కేరక్టర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ వస్త్రాలను డిజైన్ చేశారు. మెడాలియన్ బటన్స్, చక్రాల్లాంటి బ్రోచెస్ కాస్ట్యూమ్స్ కి స్పెషల్ అడిషన్‌లా అనిపించాయి. నిఖితా జైసింఘానీ స్టైలింగ్ చేశారు. మెగాపవర్‌స్టార్ లుక్‌కి అభిమానులే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్లు కూడా…
