డిఫరెంట్ జోనర్స్లో సినిమాలను రూపొందించి నేషనల్ అవార్డును పొందిన దర్శకుడు రాజేష్ టచ్‌రివర్. అంతర్జాతీయస్థాయిలో తన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన సినిమాలపై మార్చి 6 నుంచి మార్చి 8 వరకు రవీంద్ర భారతిలో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 53 ఈఎక్స్‌పీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, సన్ టచ్ ప్రొడక్షన్స్ కలయికలో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఇందులో సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోస్, షార్ట్ పిల్మ్స్, డాక్యుమెంటరీస్ను ప్రదర్శించి వాటి గురించి పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరూ కలిసి చర్చించారు. రాజేష్ టచ్‌రివర్ డెబ్యూ డైరెక్షనల్ బ్రిటీష్ ఫీచర్ ఫిల్మ్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధ’ సినిమాతో ఈ ఫెస్టివల్‌ను స్టార్ట్ చేశారు. దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలను అందుకున్న…
