విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘ఏదో ఏదో కలవరం’ అనే పాటను భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న సినిమాలోని ఈ పాటను చైతన్య వర్మ రాశారు. అనురాగ్ కులకర్ణి, దీప్తి ప్రశాంతి పాటను ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో… మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘‘చైతన్ భరద్వాజ్ నాకెంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఓ రకంగా చెప్పాలంటే నన్నెంతో భయపెట్టిన వ్యక్తి. ఇతనేంట్రా ఇలా చేస్తున్నాడు. మన పరిస్థితేంటి? అని చాలా సార్లు అనుకున్నాను. పిల్లా రా.., చుక్కల చున్నీ.., బుజ్జీ…
