అనుష్క చేతుల మీదుగా ‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ విడుదల

Trailer of 'Kalyanam Kamaneeyam' unveiled at the hands of sweetie Anushka Shetty

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రంగా ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా “కళ్యాణం కమనీయం” సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…శివ, శృతి ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు. శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను…