అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సత్తా : ‘నాటు నాటు’కే ఆస్కార్ పట్టం!

అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సత్తా : 'నాటు నాటు'కే ఆస్కార్ పట్టం!

— కన్నుల పండువగా 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం — – ఇది తెలుగోడి విజయం! – జయహో..’ఆర్.ఆర్.ఆర్’ టీమ్! – ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో పోటీ పడిన ‘నాటు నాటు’పాటను ఆస్కార్‌ వరించింది ‘త్రిబుల్ ఆర్’ చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డ్ వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ‘నాటు నాటు’ సాంగ్ కి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ…