అంచ‌నాల‌ను పెంచేసిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ‘అమిగోస్‌’ టీజ‌ర్‌!

అంచ‌నాల‌ను పెంచేసిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ‘అమిగోస్‌’ టీజ‌ర్‌!

”నాతోనే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడ‌తార్రా?” అని సీరియ‌స్‌గా అంటున్నారు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. అస‌లు ఆయ‌న‌తో ఇంత‌కీ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడింది ఎవ‌రు? అని అనుకుంటే అది మ‌రో ఇద్ద‌రు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌లు. అయ్యో! ఇదేంటి క‌ళ్యాణ్ రామ్‌తో ఆయ‌నే మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులుగా మారి గేమ్ ఆడుతున్నార‌ని తెగ ఆలోచిస్తున్నారా? ఇదొక ఫ‌జిల్‌లాగా అనిపిస్తుందా? అయితే ఈ ఫ‌జిల్‌కు సొల్యూష‌న్ దొర‌కాలంటే మాత్రం ‘అమిగోస్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేయటానికి ఆసక్తి చూపించి హీరోస్‌లో ముందు వ‌రుసలో ఉండే స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న చేస్తున్న సినిమాలే అందుకు ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవ‌చ్చు. గ‌త ఏడాది ‘బింబిసార’ వంటి డిఫ‌రెంట్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన క‌ళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ అంటూ…