యువ హీరోల్లో తన సినిమాలతోనే కాదు ఆన్ స్టేజ్ తన కామెడీతో కూడా అలరిస్తూ వస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. ‘జాతిరత్నాలు’ సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల నవీన్ కి యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పడిరది. ప్రస్తుతం నవీన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. మామూలుగా అయితే ట్రైలర్ రిలీజ్ ని ఏ సెలబ్రిటీతోనే స్టార్ హీరోతోనో చేయిస్తారు. కానీ నవీన్ అందుకు భిన్నంగా తన సినిమాలను ఆదరిస్తున్న ఆడియన్స్ నుంచి ట్రైలర్ రిలీజ్ కు గెస్ట్ లను ఆహ్వానించాడు. ట్రైలర్ రిలీజ్ కు వచ్చిన ఆడియన్స్ లో ఇద్దరు మేల్ పర్సన్స్, ఇద్దరు ఫిమేల్ పర్సన్స్ ని స్టేజ్ మీదకు పిలిచాడు నవీన్. అంతేకాదు సినిమా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే మీడియా నుంచి కూడా ఇద్దరిని పిలవగా.. వారు కూడా స్టేజ్ మీదకు వచ్చారు. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నిర్మాత కూడా స్టేజ్ మీదకు రాగా.. అప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈవెంట్ ఆడియన్స్ చేత ట్రైలర్ రిలీజ్ చేయించడం కేవలం నవీన్ వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లేలా తన ప్రతి ప్రమోషనల్ థాట్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యేలా చేస్తుంది. లేటెస్ట్ గా ఆ విషయాన్నే తన ట్విట్టర్ లో ప్రస్తావించిన నవీన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తనకు నచ్చిన పార్ట్ ఇదే అని అన్నారు. అంతేకాదు నేటి నుంచి సినిమా ప్రమోషనల్ టూర్ మొదలవుతుందని మీ అందరినీ కలిసేందుకు మీ ఏరియాలకు వస్తున్నానని అన్నారు నవీన్. నవీన్ సరసన అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ సినిమాను మహేష్ బాబు డైరెక్ట్ చేశారు. ఏజెంట్ ఆత్రేయ, ‘జాతిరత్నాలు’ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న నవీన్ ఈ సినిమాతో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. రిలీజైన ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. తప్పకుండా సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ అవుతుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి సూపర్ ఫాలోయింగ్!
