టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష కథనాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ . ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని రవితేజ అనౌన్స్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో వైవా హర్ష ఇంగ్లీష్ టీచర్‌గా కనిపించ బోతుండగా.. మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెటూరుకు సుందరం మాస్టర్ ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో అతడికి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది సినిమా స్టోరీ.
వైవిధ్యంగా ‘సుందరం మాస్టర్’
