భక్తుల పాలిట కొంగుబంగారం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి

Sri Kalyana Venkateswara Swamy, a wish-fulfilling boon for his devotees.
Sri Kalyana Venkateswara Swamy, a wish-fulfilling boon for his devotees.
Spread the love

హైదరాబాద్, నవంబర్ 19 : భక్తుల పాలిట కల్పవృక్షంగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కొలువైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు శ్రీ అలివేలు మంగమ్మ – శ్రీ పద్మావతి అమ్మవార్ల సమేతంగా భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక శోభను చాటుతున్నారు. శ్రీ మహావిష్ణువు కళ్యాణ స్వరూపుడిగా వెలసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆత్మీయ ఆనందాన్ని, భక్తి భావాన్ని కలిగిస్తుంది. స్వామివారి దివ్య సన్నిధిలో అమ్మవార్ల సమేత దర్శనం విశేష పవిత్రతను సంతరించుకుంటుంది. స్వామివారి సన్నిధి భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తూ, ధర్మం, దైవభక్తి, సేవా భావం, మానవత్వం వంటి విలువలను పెంపొందించే పవిత్ర క్షేత్రంగా విలసిల్లేందుకు శ్రీ అలివేలుమంగ , పద్మావతి సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం (రి.జి. నెం. 275/2023) హైదరాబాద్ లోని రామంతాపూర్ భగాయత్ ప్రాంతంలోని బాలకృష్ణానగర్ లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోబోతున్నది. శ్రీశ్రీశ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై దాతగా దంపతులు బొబ్బాల శశాంక్ రెడ్డి – బొబ్బాల శివాని రెడ్డి అరవై వేల రూపాయల విలువగల ఒక టన్ను స్టీల్ ను ఆలయ నిర్మాణానికి తమవంతు చేయూతగా అందిచడం జరిగింది. బొబ్బాల యాకూబ్ రెడ్డి – బొబ్బాల అలివేలు మంగ కుమారుడైన శశాంక్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పటికీ ఈ మహత్తర కార్యంలో పాలు పంచుకోవడం భక్తులను పరవశింపజేసింది. గురువారం శ్రీశ్రీశ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ దేవాలయ కమిటీ బృందం స్వయంగా బొబ్బల శశాంక్ రెడ్డి ఇంటిని సందర్శించింది. ఆ సమయంలో ఇంటివద్దే ఉన్న బొబ్బల శివాని రెడ్డి తండ్రి గారైన మారుపాక గోవర్ధనరెడ్డి ఆలయ కమిటీ సభ్యులైన ఇలిటం నరసింహారెడ్డి, పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, పడగం నగేష్, కలవటాల చందర్ రాయుడు, పర్రీ శ్రీనివాస్, గుండ్రాతి భీష్మగౌడ్ , సింగారం సతీష్ లను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా గోవర్ధనరెడ్డి చేతులమీదుగా ఆలయ కమిటీ సభ్యులు విరాళాన్ని అందుకున్నారు.
ఈ సందర్బంగా మారుపాక గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ.. ‘ధర్మో రక్షతి రక్షితః’. ఇంతటి మహత్తర కార్యంలో మేము పాలు పంచుకోవడం ఎంతో ఆనదంగా ఉంది. దైవ కార్యంలో మనం వేసే ప్రతి అడుగు మన కుటుంబానికి ఆయురారోగ్యాలను, అష్టఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. బాలకృష్ణనగర్ లో శ్రీశ్రీశ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మహత్కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై.. స్వామివారి కృపకు పాత్రులు కావాలని భక్తులందరినీ కోరుతున్నా. ఆలయ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ మీ వంతుగా ఆర్ధిక సహాయం గానీ, నిర్మాణ సామాగ్రి గాని అందించి దాతలుగా నిలవాలి. పూజలు, అర్చనలు, హారతులు, భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ వాతావరణం భక్తిమయంగా మారేందుకు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి కృపతో సకల శుభాలు కలగాలని, కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలని, శ్రీ అలివేలు మంగమ్మ, శ్రీ పద్మావతి అమ్మవార్ల సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని, భక్తుల జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం, శాంతి నిండాలని.. శ్రీ అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల సమేతంగా కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు భక్తులకు కరుణామయ దైవంగా, కల్యాణ ప్రదాతగా, కుటుంబాల పాలిట ఆరాధ్య దేవుడిగా వెలుగొందుతున్నారు. ఈ దర్శనం ప్రతి భక్తుడి జీవితంలో భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపే దివ్య అనుభూతి కలగాలని.. గోవింద నామస్మరణతో.. కల్యాణ వేంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో భక్తి భావం వెల్లివిరియాలని కోరుకుందాం. గోవిందా… గోవిందా… శ్రీనివాసా… గోవిందా! అని వేడుకున్నారు మరుపాక గోవర్ధన్ రెడ్డి.
ఇలిటం నరసింహారెడ్డి మాట్లాడుతూ ..” శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు భక్తుల పాలిట కొంగుబంగారంగా, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ స్వరూపంగా పూజలందుకుంటున్నారు. శ్రీ అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్ల సమేతంగా దర్శనమిచ్చే స్వామివారు భక్తులకు శుభం, సౌభాగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత ప్రసాదించే దైవంగా విశ్వసిస్తారు. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా అవతరించి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న దివ్య కల్యాణ ఘట్టానికి ప్రతీకగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆరాధన విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామివారి దర్శనం, కల్యాణోత్సవాలు, ప్రత్యేక పూజలు భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందించి, కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకునే ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.
పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆలయంలో నిత్య పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు, స్వామివారి కల్యాణోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని.. సాక్షాత్కార వైభవోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో ఆలయం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడేలా స్వామివారి దివ్య కల్యాణ వైభవాన్ని తలచుకుంటూ భక్తులు కుటుంబ శ్రేయస్సు, సుఖసంతోషాలు, సంతానం, వివాహ ప్రాప్తి, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తామన్నారు. శ్రీ అలివేలు మంగమ్మ / పద్మావతి అమ్మవారి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, మనశ్శాంతిని, దైవానుగ్రహాన్ని అందించే పవిత్ర అనుభూతిగా నిలుస్తుందన్నారు.