చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘రక్తధార’

'Raktadhara', directed by Chadalavada Srinivasa Rao
'Raktadhara', directed by Chadalavada Srinivasa Rao
Spread the love

ఘనంగా చదలవాడ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కొల్లూరులోని ఆయన నివాసం వద్ద జన్మ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ పాలకమండిలి సభ్యులు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ ఫిలిం జర్నలిస్టులు అందరూ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి పూలబొకేలను అందజేసి షాలువాతో ఘనంగా సత్కరించారు. దీంతో ఆయన ఎంతో ఆనందంగా గడిపారు. జర్నలిస్టులందరికీ అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తన మూడవ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ఆ చిత్రానికి ‘రక్తధార’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్టు.. ఈ చిత్ర షూటింగ్‌ మొత్తం ఆంధ్రాలో జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆయనకు ఈనాడు అధినేత రామోజీరావుతో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఓసారి అనుకోని సందర్భంలో ఆయన టింబర్‌ డిపో ప్రమాదంలో పడితే తనను ఆదుకోవడంలో ముందు వరుసలో రామోజీరావు ఉన్నారని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్బంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరావు, వెంకటేశ్వరావు, ప్రభు, సుబ్బారావు, ప్రదీప్, వినాయకరావు, బాలిరెడ్డి, మోహాన్ గోటేటి, నారాయణరాజుతో పాటు, మహిళా జర్నలిస్టులు భాగ్యలక్ష్మి, భవాని, ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు, కార్యదర్శి సురేష్ కొండేటి, వైస్‌ ప్రెసిడెంట్ ఎం.డి అబ్దుల్, జాయింట్ సెక్రటరీ పర్వీన్ బాబీ, మామిడాల గిరిధర్‌, కేశవాచారి, కుమార స్వామి, రవి గోరంట్ల, నవీన్ చెన్నంశెట్టి, అప్పాజీ, రాంబాబు, ఓంప్రకాశ్‌, సురేష్‌ కోసూరి, వల్లూరి రాఘవరావు తదితరులు పాల్గున్నారు.