టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘శ్రీమంతుడు’ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం 2015 ఆగస్ట్ 7న విడుదలై సంచలన విజయం నమోదు చేసుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 140 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాతోనే గ్రామాలను దత్తత తీసుకోవడం పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. తాజాగా ఈ ‘శ్రీమంతుడు’ యూట్యూబ్‌లో 200 మిలియన్స్ (20కోట్ల) వ్యూస్ దాటినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే యూట్యూబ్‌లో 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా ‘శ్రీమంతుడు’ రికార్డు కొట్టింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ ఖుషి అవుతున్నారు. ‘శ్రీమంతుడు’ మూవీ ఇప్పుడు కూడా రికార్డు సృష్టించిందని పోస్టులు చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాతోనే స్టార్ట్ అయ్యింది.
యూట్యూబ్‌లో ‘శ్రీమంతుడు’ రికార్డు!
