టాలీవుడ్‌తోపాటు డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ‘మిస్టర్ శెట్టి.మిసెస్ శెట్టి’ . ‘జాతిరత్నాలు’ ఫేం నవీన్ పొలిశెట్టి , అనుష్కా శెట్టి హీరోహీరోయిన్లుగా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. నవీన్ పొలిశెట్టి అండ్ స్వీటీ స్టైల్‌లో సాగే ఫన్ ఎంటర్‌టైనర్‌గా సినీ జనాలతోపాటు సెలబ్రిటీలను ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీ స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ వేయగా.. ఇండస్ట్రీ నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అద్భుతంగా సాగే ఫన్ రైడ్ అని, బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ అని అంటున్నారు డీఎస్పీ. మహేష్ బాబు పీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని సైతం ఇంప్రెస్ చేసిందని తెలిసిందే. విడుదలైన వెంటనే తొలి ప్రేక్షకుడిగా రివ్యూ కూడా ఇచ్చారు చిరు. ఇక ఇప్పుడు రాక్‌స్టార్ రివ్యూతో సినిమాపై బజ్ మరింత పెరిగిపోతుంది. ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనుష్కశెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారని చిరంజీవి చెప్పుకొచ్చారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేసే ‘మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి’ మధ్య సాగిన ఫన్నీ ట్రాక్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఇప్పటివరకు వచ్చిన టాక్, రివ్యూస్ చెబుతున్నాయి. సినిమాపై టీజర్, ట్రైలర్, పాటలతో మంచి హైప్ క్రియేట్ చేశాడు డైరెక్టర్.
‘మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి’కి సెలబ్రిటీల ప్రశంసలు!
