ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ హీరోగా షర్మిళ కంచి సమర్పణలో డి.ఎల్. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్.కె. క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై రామకృష్ణ కంచి రచన, దర్శకత్వంలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్ నిర్మించిన డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘షార్ట్‌కట్’. విజయానికి అడ్డదారులు లేవు అనేది ట్యాగ్‌లైన్. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం షో రీల్, పోస్టర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో శివాజీ విచ్చేశారు. అలాగే బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో పాటు, కంటెస్ట్‌లు, మల్కాజ్‌గిరి ఏసీపీ విచ్చేశారు.
ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ…
సందీప్ మంచి ఆటగాడు. బయట డాన్స్‌మాస్టర్‌గానే కాదఱు.. బిగ్‌బాస్‌లో కూడా బాగా ఆడాడు. మంచి వ్యక్తి. నాకు సందీప్ చిన్నతనం నుంచి తెలుసు. కష్టపడటం అంటే ఇష్టపడే వ్యక్తి. ఈ సినిమాలో అతను డాన్స్‌లే కాదు.. మంచి యాక్షన్ సీన్‌లు కూడా చేశాడు. హీరోగా కూడా తప్పకుండా సక్సెస్ అవుతాడనే నమ్మకం నాకు ఉంది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తున్న ఈ చిత్రానికి పనిచేసిన యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
హీరో సందీప్ మాట్లాడుతూ…
ఇది నా రెండో సినిమా. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నాను. రామకృష్ణగారు ప్యాషనేట్ డైరెక్టర్. దాదాపు 15 శాఖలపై పూర్తి అవగామన ఉన్న వ్యక్తి. నన్ను సపోర్ట్ చేయటానికి మా అన్నయ్య శివాజీ, మిగిలిన బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. పేరుకే చిన్న సినిమాగా అనిపిస్తుంది గానీ, ఇది పక్కా కమర్షియల్ అంశాలతోకూడిన బడ్జెట్ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు అన్నీ ఇందులో ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు.
బిగ్‌బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ…
సందీప్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. బిగ్‌బాస్ హౌస్‌లో మేం అందరం పోటీదారులం. కానీ బయటకొచ్చిన తర్వాత మంచి మిత్రులం. నామీద మీరు చూపించే అభిమానం సందీప్ అన్న సినిమా ‘షార్ట్ కట్’పై కూడా చూపించాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన తోట రంగారావు మాట్లాడుతూ…
సందీప్ గారు ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోవడం మా అదృష్టం. మంచి పేరు తెచ్చే క్యారెక్టర్. ఈ సినిమాను కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజానికి మంచి మెసేజ్ కూడా ఇవ్వాలని నిర్మించాము. మా అంచనాలను ఏమాత్రం వమ్ము చేయకుండా దర్శకులు రామకృష్ణ గారు అద్భుతంగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు ధృవన్ సూపర్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చారు. అందరికీ నచ్చే చిత్రం అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం అన్నారు.
దర్శకుడు రామకృష్ణ కంచి మాట్లాడుతూ….
దాదాపు 25 సంవత్సరాల నుంచి పరిశ్రమలో ఉన్నాను. చాలా శాఖల్లో పనిచేశాను. ఆ అనుభవాన్ని మొత్తం కలిపి ఈ ‘షార్ట్ కట్’ తీయడం జరిగింది. దీనికి ఎడిటింగ్ బాధ్యతలు కూడా నేనే చేపట్టాను. ప్రస్తుతం యువత డ్రగ్స్‌కు అలవాటుపడి తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు.. ఈ దందా వెనుక జరుగుతున్న చీకటి కోణాలు ఏమిటి అనేవి ఈ చిత్రంలో చూపించడం జరిగింది. నిర్మాతలు రంగారావు గారు, రజనీకాంత్ గారు నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడకుండా సినిమాను ముందుకు తీసుకువెళ్లారు. వారికి నా ధన్యవాదాలు. రాకేష్ మాస్టర్ కూడా మంచి రోల్ చేశారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. యూనిట్ సభ్యులు అందరూ ఇది తమ చిత్రంగా భావించి పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎన్. మీరా, సంగీతం: ఆర్.ఆర్. ధృవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ చేర్యాల, స్క్రిప్ట్ మానిటర్: మనోజ్‌కుమార్, ప్రొడక్షన్ డిజైనర్స్ : మురళి జి., ఎం. నరేంద్రబాబు, పి.ఆర్.ఓ: బి. వీరబాబు, నిర్మాతలు:తోట రంగారావు, పున్నపు రజనీకాంత్, కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: రామకృష్ణ కంచి.