– సరికొత్త చరిత్రను సృష్టించిన RRR
– అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి
RRR (రౌద్రం రణం రుధిరం)…ఇద్దరు అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రం. టాలీవుడ్ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై తిరుగులేని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపి వాహ్.. అనిపించింది. దాంతో ఈ చిత్రానికి ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ‘త్రిబుల్ ఆర్’ చిత్రానికి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ‘నాటు నాటు’ సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్ రావడం ఏషియాలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ‘త్రిబుల్ ఆర్’ డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు. ఓటీటీతో వరల్డ్ వైడ్‌గానే RRR సినిమా చాలా రోజుల పాటు థియేటర్లలో భారీ ప్రభావాన్ని చూపించిదన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ చిత్రం అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా దక్కాయి. అంతేకాదు, ఈ చిత్రం ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించింది. విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన ‘త్రిబుల్ ఆర్’ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి ఎణ్నో అవార్డులకు నామినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం అయ్యాయి. 2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా తాజాగా అకాడమీ పది విభాగాల్లో షార్ట్ లిస్టులను విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలను ఉంచింది. వాటిలో RRR మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ కూడా చోటు దక్కించుకుంది. దీంతో సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గోల్డెన్ గ్లోబ్‌కు.. రెండింట్లో ఆస్కార్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ 80వ అవార్డుల కార్యక్రమం కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో RRR (రౌద్రం రణం రుధిరం) బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ విభాగాల్లో నామినేట్ అయిన విషయం తెలిసిందే. దీనికోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి తమ ఫ్యామిలీలతో అక్కడకు చేరారు. నాటు నాటుకు అవార్డు ఎంతో వైభవంగా జరుగుతోన్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR (రౌద్రం రణం రుధిరం) చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రకటించగానే ఆ సభా ప్రాగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఇక, ఏషియా ఖండం నుంచి ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి చిత్రంగా RRR సరికొత్త చరిత్రను సృష్టించింది. అందుకున్న కీరవాణి 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా RRRలోని ‘నాటు నాటు’ సాంగ్ ఎంపిక అవగానే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి తమ ఆనందాన్ని పంచుకుంటూ కేకలు వేశారు. ఎంతో మంది అతిరథమహారథుల మధ్య ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఇక, ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ ఇవ్వగా రాహుల్ పాడాడు.