RRR Movie : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలకు రెండు రిలీజ్ డేట్స్ ఫిక్స్

RRR movie relese dates Fix
Spread the love

కరోనా థర్డ్‌ వేవ్‌, కర్ఫ్యూ, థియేటర్‌లలో 50 శాతం ఆక్యుపెన్సీ తదితర కారణాలతో వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త విడుదల తేదీతో చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించారు. ‘‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్‌ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే మార్చి 18న, లేదంటే ఏప్రిల్‌ 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర బృందం ఓ పోస్టర్‌ విడుదల చేసి తెలిపారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ భామ ఒలివియా మోరీస్‌, చరణ్‌ సరసన అలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రధారులు. కీరవాణి సంగీతం అందించారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న ప్ర‌స్తుతం ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కించాడు. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం ప‌లుమార్లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆ మధ్య ప్రకటించింది. దీంతో జనవరి 7న విడుదలకానున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో రాజ‌మౌళి తాజాగా బిగ్ అప్‌డేట్‌ను ఇచ్చారు. చిత్ర యూనిట్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సినిమాను మార్చి 18, 2022న విడుద‌ల చేయ‌నున్నామ‌ని, కుద‌ర‌ని ప‌క్షంలో ఏప్రిల్ 28న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో అటు రామ్ చ‌ర‌ణ్‌తో పాటు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఖుషీ అవుతున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా RRR సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. చ‌రిత్ర‌లో క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఊహాత్మ‌క క‌థతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Related posts

Leave a Comment