నెలాఖరులో కొత్త చిత్రాల విడుదల.. 25న ‘గాండీవధారి’ విడుదలకు సిద్దం

Release of new films at the end of the month.. Ready for the release of 'Gandivadhari' on 25th
Spread the love

త వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు రాగా.. ఇప్పుడు ఈ నెల చివరి వారంలో మరికొన్ని విభిన్న చిత్రాలు ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓటీటీలోనూ పలు హిట్‌ చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రవీణ్‌ సత్తారు కాంబోలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ’గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. వరుణ్‌తేజ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఘోస్ట్‌ లాంటి భారీ డిజాస్టర్‌ తర్వాత ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రం అటు వరుణ్‌కు ఇటు ప్రవీణ్‌ సత్తారుకు ఎంతో కీలకం. కార్తికేయ, నేహా శెట్టి కలిసి క్లాక్స్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బెదురు లంక 2012’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ‘ఆర్‌ ఎక్స్‌ 100’ తర్వాత కార్తికేయ ఎన్నో చిత్రాలు చేశారు. కానీ ఒక్కటి ‘ఆర్‌ ఎక్స్‌ 100’ రేంజ్‌లో హిట్‌ అందుకోలేదు. ఈ సినిమాపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇంకా థియేటర్‌లో మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌` ఐశ్వర్య లక్ష్మి నటించిన ’కింగ్‌ ఆఫ్‌ కొత్త’ ఆగస్ట్‌ 24న రిలీజ్‌ కానుంది. అభిలాష్‌ జోషిలీ దర్శకుడు. ఆగస్టు 25న విజయ్‌ రాజ్‌ కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’ విడుదల కానుంది. చిన్న చిత్రంగా విడుదలై కన్నడలో ఘనవిజయం సాధించిన ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’… తెలుగులో ’బాయ్స్‌ హాస్టల్‌’గా ఆగస్టు 26న విడుదలవుతోంది. ఓటీటీలో కూడా పలు చిత్రాలు, సిరీస్‌లు అలరించనున్నాయి.

Related posts

Leave a Comment